Meat In Paneer Curry: శివ భక్తుడికి షాక్.. పనీర్ కర్రీలో చికెన్ ముక్క..
ABN , Publish Date - Aug 11 , 2025 | 08:27 AM
Meat In Paneer Curry: ధీరజ్ స్థానికంగా ఉండే శివాలయంలో నిత్యం సేవలు చేస్తూ ఉన్నాడు. శనివారం అతడు ఆన్‌లైన్ ద్వారా ఓ రెస్టారెంట్ నుంచి పనీర్ కర్రీ, రోటీలు ఆర్డర్ పెట్టాడు. వాటిని తింటున్న అతడికి ఊహించని షాక్ తగిలింది.
గత కొన్నేళ్లుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే హోటల్ ఫుడ్ తినాలన్న కోరికే చచ్చిపోతోంది. హోటల్ ఆహారంలో పురుగులు, బల్లులు, ఎలుకలు బయటపడ్డ సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్, చౌబేపూర్‌లోని ఓ హోటల్‌లో భోజనం చేస్తున్న కస్టమర్‌కు షాక్ తగలింది. అతడు తింటున్న పరాటాలో ఏకంగా బల్లి బయటపడింది. ఈ సంఘటన మరువక ముందే ఉత్తర ప్రదేశ్‌లో మరో సంఘటన చోటుచేసుకుంది. ఈ సారి వెజ్ కర్రీలో చికెన్ ముక్క బయటపడింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సదర్ కోత్వాలీ ఏరియాలోని మగర్‌వారాకు చెందిన ధీరజ్ స్థానికంగా ఉండే శివాలయంలో నిత్యం సేవలు చేస్తూ ఉన్నాడు. శనివారం అతడు ఆన్‌లైన్ ద్వారా ఓ రెస్టారెంట్ నుంచి పనీర్ కర్రీ, రోటీలు ఆర్డర్ పెట్టాడు. వాటిని తింటున్న అతడికి ఊహించని షాక్ తగిలింది. పనీర్ కర్రీలో చికెన్ ముక్క బయటపడింది. అతడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పార్సిల్ తన దగ్గరకు వచ్చే సమయానికి ఓపెన్ చేసి ఉందని అన్నాడు.
కర్రీ తింటూ ఉండగా మాంసం రావటంతో షాక్ అయ్యానని చెప్పాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ధీరజ్ పోస్టు చేసిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇంకా నయం ఏ ఎలకో.. బల్లోరాలేదు. ఈ హోటల్ వాళ్లకు కొంచెం కూడా పరిశుభ్రత గురించి తెలియదు. దారుణంగా వంటలు చేస్తారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
స్థల వివాదం.. స్టార్ హీరో సమాధి తొలగింపు..