Kishan Reddy VS Revanth: రాజకీయాలకు సంబంధం లేని రాష్ట్రపతి గురించి మాట్లాడుతారా: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Aug 07 , 2025 | 09:49 AM
రాష్ట్రపతిపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాల నిడిమాండ్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేని రాష్ట్రపతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
ఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని విమర్శలు చేశారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో ప్రదక్షిణలు తప్పా.. రేవంత్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆక్షేపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు, కాంగ్రెస్‌పై ప్రశంసలు తప్ప రేవంత్‌రెడ్డి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ (గురువారం) ఢిల్లీ వేదికగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. బీసీలకు రూ.లక్ష కోట్లు ఇస్తామన్న హామీ ఏమైంది..? అని నిలదీశారు. బీసీల రిజర్వేషన్ల అమలుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఎన్నికల హామీలు ఏమయ్యాయి..? అని ప్రశ్నించారు. రాష్ట్రపతిపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు కిషన్ రెడ్డి.
ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేని రాష్ట్రపతి గురించి మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. భారత జాతికి క్షమాపణలు చెప్పాలని.. ఇది మహిళలకు జరిగిన అవమానమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్
తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దర్
Read latest Telangana News And Telugu News