CM Revanth on KTR And Lokesh Meeting: కేటీఆర్, లోకేష్ భేటీపై సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:05 PM
హైడ్రా ఎందుకు తెచ్చామో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌కి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్(KTR), ఏపీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కలుసుకోవడంపై తాను కామెంట్ చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. వారిద్దరూ కలుకోవడం వారి వ్యక్తిగత అంశమని సీఎం తెలిపారు. లోకేష్‌ను కేటీఆర్ తమ్ముడని అంటున్నారని.. మరి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో రోడ్లపైకి వచ్చిన వారిని ఎందుకు కొట్టారో చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబును జైల్లో ఉంచినప్పుడు కేటీఆర్ ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఎల్ అండ్ టీ ఎందుకు వివరణ ఇవ్వలేదు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలో రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని.. ఇంతవరకూ ఎందుకు నెరవేర్చట్లేదని ప్రశ్నించారు. యూరియా కొరత కూడా రాజకీయ సృష్టే అని ఆరోపించారు. తెలంగాణలో హైడ్రా ఎందుకు తెచ్చామో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసునని చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌కి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ మెట్రో బాధ్యత నుంచి ఎల్ అండ్ టీ తప్పుకుంటామని అంటోందని, అది కేసీఆర్ చేసిన తప్పిదమేనని విమర్శించారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ సంస్థ ఎందుకు వివరణ ఇవ్వలేదని నిలదీశారు సీఎం రేవంత్‌రెడ్డి.
మావోయిస్టులతో చర్చించాలి...
హైదరాబాద్ మెట్రోలో ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని.. రానున్న ఐదేళ్లలో 15 లక్షల మంది ప్రయాణం చేసే విధంగా తాము ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. అలాగే, పార్టీ నేతల కామెంట్లపై స్పందించారు సీఎం రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని ఉద్ఘాటించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక తయారు కావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కొందరూ నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని.. వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పాలసీ ఉందని గుర్తుచేశారు. మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేయడంతో వారి సమస్య పరిష్కారం కాదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారితో చర్చించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి..
జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్‌రెడ్డి
For More Telangana News And Telugu News