Share News

CM Revanth on Local Body Elections: సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు జరపలేం: సీఎం రేవంత్‌

ABN , Publish Date - Sep 19 , 2025 | 05:53 PM

బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు బీసీ రిజర్వేషన్ విషయంలో వేచి చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

CM Revanth on Local Body Elections: సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు జరపలేం: సీఎం రేవంత్‌
CM Revanth Reddy on Local Body Elections

ఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections)పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (శుక్రవారం) ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. సెప్టెంబర్‌ 30వ తేదీలోపు స్థానిక ఎన్నికలు జరపడం కష్టమని తెలిపారు.


ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్‌దే నిర్ణయం..

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల నుంచి రూ.5000లు ఆ పార్టీకే వెళ్తుందని అన్నారు. నిధులు సైతం బీఆర్ఎస్‌కే వెళ్తున్నాయని తెలిపారు. అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ తమకు 37 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, సమయం కేటాయించాలని కోరారని గుర్తుచేశారు సీఎం రేవంత్ రెడ్డి.


ఈ వార్తలు కూడా చదవండి..

జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రమాదం.. ఏమైందంటే..

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్‌రెడ్డి

For More Telangana News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 06:11 PM