Share News

భాగ్యనగరంలో చిరుజల్లులు.. ఎండల నుంచి ప్రజలకు ఊరట

ABN , Publish Date - May 15 , 2026 | 05:27 PM

గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన అంబర్‌పేట్ ప్రజలకు శుక్రవారం సాయంత్రం కురిసిన చిరుజల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు వర్షంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు.

భాగ్యనగరంలో చిరుజల్లులు.. ఎండల నుంచి ప్రజలకు ఊరట
Hyderabad Weather

హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): గత కొద్దిరోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కపోతకు గురైన అంబర్‌పేట్ ప్రజలకు ఈరోజు (శుక్రవారం) సాయంత్రం కురిసిన చిరుజల్లులు కొంత ఉపశమనం కలిగించాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు వర్షంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో అంబర్‌పేట పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోజంతా ఉన్న వేడి తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడింది. ఎండలతో అలసిపోయిన ప్రజలు ఈ వర్షంతో ఊపిరిపీల్చుకున్నారు.


ట్రాఫిక్‌కు అంతరాయం..

అయితే సాయంత్రం సమయంలో కురిసిన వర్షం కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రధాన రహదారులపై స్వల్పంగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇళ్లకు బయలుదేరిన ఆఫీసు సిబ్బంది ట్రాఫిక్ సమస్యలతో అవస్థలు పడ్డారు. పిల్లలు, యువత వర్షాన్ని ఆస్వాదిస్తుండగా, వ్యాపారులు మాత్రం ఆకస్మిక వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గే అవకాశముందని అధికారులు చెప్పారు. వేసవి తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశముందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 15 , 2026 | 05:47 PM