తుఫాను అలర్ట్.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:46 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.
విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు..
ఉమ్మడి విజయనగరం జిల్లాలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. వానలు కురుస్తోండటంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యా శాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించారు. రెడ్ అలర్ట్ నేపథ్యంతో యంత్రాంగాన్ని ఉభయ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు..
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఈరోజు (బుధవారం) విద్యా సంస్థలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ సెలవు ప్రకటించారు. నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు పొంచి ఉందని తెలిపారు. తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం
పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని తీవ్రవాయుగుండం కొనసాగుతోందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కలింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల దూరంలోనూ, గోపాల్‌పూర్‌కి 150 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉందని వివరించారు. ఇది ఈరోజు రాత్రికి విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్య, కలింగపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HAM మోడల్‌తో చాలా వినూత్నంగా ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదేలే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News