Share News

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ABN , Publish Date - Aug 14 , 2026 | 07:50 AM

ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు
Onam special trains

హైదరాబాద్‌ సిటీ: ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 16నుంచి 31వరకు ప్రతీ ఆదివారం చర్లపల్లి నుంచి ఉదయం 7.15గంటలకు 07197 ప్రత్యేక రైలు, ప్రతీ సోమవారం సాయంత్రం 4.45గంటలకు కొట్టాయం నుంచి ప్రత్యేక రైలు బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city1.2.jpgఈ రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం, తిరుపూర్‌, పోడనూర్‌, పాలక్కడ్‌, త్రిశూర్‌, అలువ, ఎర్నాకుళం స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ రైలుకు సెకండ్‌ ఏసీ, థర్డ్‌ఏసీ బోగీలతో పాటు స్లీపర్‌, జనరల్‌ క్లాస్‌ బోగీలు కూడా ఉంటాయని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 07:51 AM