రేవంత్‌రెడ్డి షెల్ కంపెనీల బాగోతాన్ని బయట పెడతాం: కేటీఆర్
ABN , Publish Date - Aug 11 , 2026 | 02:41 PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయటపెడతామని హెచ్చరించారు.
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయటపెడతామని హెచ్చరించారు. ఈరోజు (మంగళవారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. కొండల్‌రెడ్డి టెస్రాక్ట్ (Tesract) సంస్థకు చైర్మన్‌గా ఉన్నానని ఆయనే చెప్పారని అన్నారు. రేవంత్ బ్రదర్స్ సూటు బూట్లతో కంపెనీలు ఎలా పెట్టారని ప్రశ్నించారు. టెస్రాక్ట్ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ కూడా లేరని చెప్పారు. ఆ కంపెనీకి వేల కోట్ల భూములు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఆ కంపెనీకి కొండల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు ఎలా చెబుతారని నిలదీశారు.
వార్తలు కూడా చదవండి...
'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్
ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?
Read Latest AP News And Telangana News And National News
And Telugu News