తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?
ABN , Publish Date - Aug 10 , 2026 | 08:46 AM
తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సోమవారం ‘సర్’ ప్రక్రియ ముగియనుంది.
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో (Telangana SIR Process) 73 లక్షల 95 వేల 954 ఓట్లు తొలంగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈరోజు (సోమవారం) ‘సర్’ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి అయింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,38,26,448 ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది. డిజిటలైజేషన్‌లో హైదరాబాద్ 58.58 శాతంతో చివరి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మేడ్చల్ – మల్కాజిగిరి 63.82 శాతం, రంగారెడ్డి 64.91 శాతం రికార్డైంది.
అత్యధిక డిజిటలైజేషన్‌తో యాదాద్రి భువనగిరి 94.30 తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతం డిజిటలైజేషన్ పూర్తి అయింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లో 89.45 శాతం, జగిత్యాలలో 89.60 శాతం పూర్తి అయింది. రెండు సార్లు గడువు పొడిగించిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పెరగలేదు.
వార్తలు కూడా చదవండి...
కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క
తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్
సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News