తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్
ABN , Publish Date - Aug 09 , 2026 | 02:21 PM
పోలీసు శాఖలో మెరుగైన సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిజం, నక్సలిజం పూర్తిగా అంతమైందని వ్యాఖ్యానించారు.
వరంగల్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో మెరుగైన సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిజం, నక్సలిజం పూర్తిగా అంతమైందని వ్యాఖ్యానించారు. కర్రెగుట్టల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాన కేడర్ అంతా లొంగిపోయిందని తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వరంగల్ జిల్లాల్లో డీజీపీ ఈరోజు(ఆదివారం) పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మావోయిస్టులతో ఇంట్రాక్ట్ అవుతాం..
రేపు ములుగులో లొంగిపోయిన మావోయిస్టులతో ఇంట్రాక్ట్ అవుతామని డీజీపీ చెప్పుకొచ్చారు. మావోయిస్టు కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తన ఐపీఎస్ ప్రస్థానం వరంగల్ నుంచే ప్రారంభమైందని.. కానీ ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదని ప్రస్తావించారు. గన్‌మెన్‌లను తగ్గించామని కొందరు రాజకీయం చేస్తున్నారని తెలిపారు. మావోయిస్టుల సమస్య తగ్గడంతో అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే.. రాజకీయ నాయకులకు ఇక్కడ భద్రత తగ్గించామని వివరించారు.
మాదక ద్రవ్యాల నివారణకు కొత్త వ్యూహాలు..
పూర్తిగా తొలగించకుండా తగ్గించామని డీజీపీ చెప్పారు. సెక్యూరిటీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా భద్రత తగ్గించామని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రధాన సమస్య మాదకద్రవ్యాలు అని వెల్లడించారు. మాదక ద్రవ్యాల నివారణకు కొత్త వ్యూహాలు అమలు చేస్తామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు వింగ్‌లో మార్పులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గ్రేహౌండ్స్, కొన్ని ఇతర విభాగాలను మారుస్తామని అన్నారు. డిపార్ట్‌మెంట్ మొత్తాన్నే సంస్కరిస్తున్నామని వెల్లడించారు.పోలీస్ స్టేషన్‌లో రోటీన్‌గా జరిగే పనులు జరుగుతాయని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
వార్తలు కూడా చదవండి...
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్
మాకు క్షుద్ర రాజకీయాలు తెలియవు: కేటీఆర్
సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News