మాకు క్షుద్ర రాజకీయాలు తెలియవు: కేటీఆర్
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:25 PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు క్షుద్ర రాజకీయాలు తెలియవు అని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు క్షుద్ర రాజకీయాలు తెలియవు అని పేర్కొన్నారు. క్షుద్ర పూజలంటూ కాంగ్రెస్ నేతలు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (శనివారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్‌రావు గుడికి వెళ్లడం తప్పా? అని ప్రశ్నించారు.
రైతులపై రేవంత్‌రెడ్డికి కనీస పరిజ్ఞానం లేదు..
స్ట్రెయిట్ రాజకీయాలు మాత్రమే తమకు తెలుసునని కేటీఆర్ స్పష్టం చేశారు. రైతులపై రేవంత్‌రెడ్డికి కనీస పరిజ్ఞానం లేదని తెలిపారు. తాము డిమాండ్ చేస్తేగానీ పంప్‌లు ఎందుకు ఆన్ చేయలేదని ప్రశ్నించారు. సీఎంకు ఎప్పుడు నీళ్లు ఎత్తిపోయాలో కూడా తెలియదని విమర్శించారు. హరీశ్‌రావు ఈ విషయంపై ప్రశ్నించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. సీఎం రేవంత్ దృష్టిలో భూమి అంటే రియల్ ఎస్టేట్ అని ఎద్దేవా చేశారు. GRMB ఎజెండాలో 7 వివాదాస్పద అంశాలు ఉన్నాయని కేటీఆర్ ప్రస్తావించారు.
వార్తలు కూడా చదవండి...
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు
జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు
క్షుద్ర పూజల విషయంలో హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News