సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్
ABN , Publish Date - Aug 08 , 2026 | 04:42 PM
సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ, R&R కోసం రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. నిధుల కొరతతో సాగునీటి పనులు ఆగొద్దని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. భూసేకరణ, R&R కోసం రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. నిధుల కొరతతో సాగునీటి పనులు ఆగొద్దని చెప్పుకొచ్చారు. ఈరోజు (శనివారం) సచివాలయంలో మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులను వెంటనే పున:ప్రారంభిస్తామని వివరించారు. పత్తిపాక రిజర్వాయర్‌ను ఫాస్ట్‌ట్రాక్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. పత్తిపాకతో కొత్తగా 10 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని పేర్కొన్నారు.
రోళ్లవాగుపై ప్రత్యేక దృష్టి..
2.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఆగస్టు నెలాఖరులోగా పత్తిపాక డీపీఆర్ సిద్ధం చేస్తామని తెలిపారు. 96 శాతం పూర్తైన రోళ్లవాగుపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. రోళ్లవాగుతో 15 వేల ఎకరాల చివరి ఆయకట్టుకు నీరు అందజేస్తామని చెప్పుకొచ్చారు. భూసేకరణ, టెండర్లు, అనుమతులను సమాంతరంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పెండింగ్ సమస్యను ‘యాక్షన్ పాయింట్’గా మార్చాలని సూచించారు. తదుపరి సమీక్షకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తప్పనిసరని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీరందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు
జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు
క్షుద్ర పూజల విషయంలో హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News