ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
ABN , Publish Date - Aug 10 , 2026 | 08:04 AM
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్ పంపారు.
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును (Uday Krishna Reddy case) సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు (Nageswara Rao) సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్ పంపారు.. ఈ కేసును సీబీసీఐడీ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టుపై పలు ప్రశ్నలను నాగేశ్వరరావు లేవనెత్తారు.
పోష్ చట్టం కింద అంతర్గత విచారణ పూర్తికాకముందే ఉదయ్ కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారని నాగేశ్వరరావు ప్రశ్నించారు. అతడిని అరెస్టు చేసే సమయంలో దర్యాప్తునకు సహకరించాడా?, సాక్షులను ప్రభావితం చేస్తాడా?, పరారయ్యే అవకాశముందా? వంటి అంశాలను పరిశీలించారా? అని నిలదీశారు. తొలుత బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుల్లో అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు లేవని ప్రస్తావించారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తీవ్ర ఆరోపణలు చేర్చారని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తుపై తలెత్తిన అనుమానాలకు స్వతంత్ర విచారణతోనే తెరపడుతుందని డీజీపీకి సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
వార్తలు కూడా చదవండి...
కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క
తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్
సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News