కేసీఆర్ పాల్పడిన అరాచకానికి ప్రకృతి శిక్షించడం ఖాయం.. సీఎం రేవంత్ వార్నింగ్
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:38 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను అధికారంలోకి రానిచ్చేది లేదని పేర్కొన్నారు.
ఢిల్లీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను అధికారంలోకి రానిచ్చేది లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావంతో తెలంగాణను దోచేశారని ధ్వజమెత్తారు. ఈరోజు (శుక్రవారం) ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. కేసీఆర్ ఎంతోమంది పిల్లలను చంపారని మండిపడ్డారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఒకటే..
ఆ పాపం కేసీఆర్‌ను వెంటాడుతోందని.. ఆయన పాల్పడిన అరాచకానికి ప్రకృతి శిక్షిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ రెండోసారి ఓడిపోవడానికి ప్రకృతి తన పని తాను చేయడమేనని పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో మెదడు లేకుండా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మేడిగడ్డ, సుందిళ్ల అన్నారం బ్యారేజీల మరమ్మతులను ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఒకటేనని, పైకే విడిపోయినట్లుగా కనిపిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి భద్రత కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
కరవును చంద్రబాబు బాగా మేనేజ్ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News