ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి.. బీఆర్ఎస్ ఆందోళన
ABN , Publish Date - Mar 23 , 2026 | 10:50 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి (Madhusudana Chari) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు. ఈరోజు(సోమవారం) హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతోందని.. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కేసీఆర్ కూడా కొనసాగించారని ప్రస్తావించారు. విద్యార్థులకు నిజాయితీగా లబ్ధి చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మధుసూదనాచారి ధ్వజమెత్తారు.
అసెంబ్లీ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నం

మరోవైపు.. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. నిరసనకారులను చిక్కడపల్లికి పోలీసులు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన
బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
Read Latest Telangana News And AP News And International News And Telugu News