Share News

దేశ మహిళలను ఇండియా కూటమి ఓడించింది.. బండి సంజయ్ ధ్వజం

ABN , Publish Date - Apr 17 , 2026 | 09:58 PM

భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి తల్లి, అక్కా, చెల్లి, కుమార్తెకు ఈరోజు అవమాన దినమని పేర్కొన్నారు.

దేశ మహిళలను ఇండియా కూటమి ఓడించింది.. బండి సంజయ్ ధ్వజం
Bandi Sanjay Kumar

ఢిల్లీ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి తల్లి, అక్కా, చెల్లి, కుమార్తెకు ఈరోజు అవమాన దినమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇండియా కూటమి అసలు రంగు బయటపడిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ కాల ‘కూట‘మి విషం కక్కింది..? అని ధ్వజమెత్తారు. మహిళా హక్కులను కబళించడం రాజకీయ పాపమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు (శుక్రవారం) ఢిల్లీ వేదికగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని మహిళలందరినీ ఓడించినందుకు సంబరాలు చేసుకుంటారా..? అని ఆగ్రహించారు. దేశ మహిళలు త్వరలోనే ఇండియా కూటమిని ఓడించి సంబురాలు చేసుకునే రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి మహిళా వ్యతిరేకి అని చెప్పుకొచ్చారు.


అవి కుటుంబ పార్టీలే..

మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. డూప్లికేట్ గాంధీ, స్టాలిన్, అఖిలేశ్ కుటుంబాల మహిళలకు మాత్రమే పదవులుండాలా..? అని ప్రశ్నించారు. సాధారణ మహిళలకు చట్టసభల్లో వాటా ఇస్తుంటే ఓర్వలేక బిల్లును అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ఇండియా కూటమి ఓడించింది ఎన్డీఏను కాదని... దేశంలోని మహిళలందరినీ అని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ముమ్మాటికీ మహిళా ద్రోహులేనని విమర్శించారు.


హామీ ఇచ్చి వంచించారు..

అధికారంలో ఉన్నంత కాలం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి వంచించారని ఫైర్ అయ్యారు. దేశ ప్రజలు ఇండియా కూటమిని పదేపదే ఓడిస్తూ ఛీ కొడుతున్నా.. ఆ పార్టీ నేతలకు జ్ఞానోదయం కలగడం లేదని అన్నారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్, టీఎంసీ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమికి మహిళా శక్తి అంటే ఏమిటో చాటి చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్.. నీ చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. మహేశ్ గౌడ్ సవాల్

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 17 , 2026 | 10:05 PM