-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 27th August 2026 BSB
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 27 , 2026 | 06:54 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 27, 2026 08:30 IST
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సానుభూతి
-
Aug 27, 2026 08:14 IST
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం
అమరావతి ప్రాజెక్టుల పురోగతిపై నేడు కీలక నిర్ణయాలు
-
Aug 27, 2026 08:01 IST
నేపాల్ వరద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
నేపాల్‌లో భయంకర వరదలు, విధ్వంసం కలచివేసింది: పవన్ కల్యాణ్
150 మందికి పైగా యాత్రికులు గల్లంతు కావడం ఆందోళనకరం: పవన్ కల్యాణ్
చిక్కుకుపోయిన, గల్లంతైన వారికి తక్షణ సహాయం అందాలి: పవన్ కల్యాణ్
నేపాల్‌కు సాయం అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది: పవన్
-
Aug 27, 2026 07:54 IST
చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
అదనపు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన హోం మంత్రి అనిత
ప్రమాద తీవ్రత, మృతులు–క్షతగాత్రుల వివరాలు, సహాయక చర్యలపై ఆరా
-
Aug 27, 2026 07:48 IST
పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సానుభూతి
-
Aug 27, 2026 07:39 IST
అనంతపురం: రాయదుర్గం-అనంతపురం హైవేపై బ్రాహ్మణపల్లి వద్ద ఇన్నోవా బోల్తా
ఇద్దరు వ్యక్తుల మృతి, మరో ఇద్దరికి గాయాలు
మృతులు కల్యాణదుర్గానికి చెందిన రాఘవేంద్ర గుప్తా, నాగరాజుగా గుర్తింపు
-
Aug 27, 2026 07:35 IST
విశాఖ: షీలానగర్‌లో లారీ డ్రైవర్‌పై దాడి ఘటనలో RTO డ్రైవర్ అరెస్ట్
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ను ప్రశ్నిస్తున్న మల్కాపురం పోలీసులు
ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా సీపీకి హైకోర్టు ఆదేశం
-
Aug 27, 2026 07:25 IST
నేడు హన్మకొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పర్యటన
పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలో పాల్గొననున్న హరీశ్‌రావు
-
Aug 27, 2026 07:25 IST
నేడు వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ పర్యటన
ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్న కొండా సురేఖ
-
Aug 27, 2026 07:18 IST
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూత
అనారోగ్య సమస్యలతో నారాయణరావు మృతి
1976లో 'అంతులేని కథ' ద్వారా వెండి తెరకు నారాయణరావు పరిచయం
-
Aug 27, 2026 07:12 IST
తిరుపతి: ఏర్పేడు వ్యాసాశ్రమం శతాబ్ది ఉత్సవాలకు బ్రేక్
నేటి నుంచి జరగాల్సిన శతాబ్ది ఉత్సవాలు
శతాబ్ది ఉత్సవాలకు భద్రత కల్పించలేమన్న పోలీసులు
ఉత్సవాలను వాయిదా వేసుకోవాలని పోలీసుల సూచన
-
Aug 27, 2026 07:12 IST
రేపు ఏపీ JAC అమరావతి రాష్ట్రస్థాయి సదస్సు
ఉద్యోగుల సమస్యలపై ఐక్య ఉద్యమాలకు పిలుపు
ఏపీ JAC సదస్సుకు ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం
-
Aug 27, 2026 07:11 IST
నేడు దేశవ్యాప్తంగా 'ఖేల్ కీ బాత్, పీఎం కే సాథ్' కార్యక్రమం
క్రీడాకారులతో వర్చువల్‌గా మాట్లాడనున్న ప్రధాని మోదీ
జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా 'ఖేలో ఇండియా డైలాగ్'
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని రెండు కాలేజీల్లో కార్యక్రమం
‘నషా ముక్త్ యువ’ ఉద్యమంపై యువతతో ప్రత్యేక సంభాషణ
-
Aug 27, 2026 06:59 IST
చైనాలోని గ్యాస్ కాంప్లెక్స్‌లో పేలుడు.. ఏడుగురి మృతి
-
Aug 27, 2026 06:59 IST
నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 157కు చేరిన మృతుల సంఖ్య
133 మంది భారతీయ యాత్రికుల గల్లంతు
ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు ఆలస్యం
-
Aug 27, 2026 06:58 IST
అక్టోబర్‌లో మణిపుర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన
జనగణన కంటే ముందే NRC చేపట్టే యోచనలో కేంద్రం
-
Aug 27, 2026 06:55 IST
పల్నాడు: చిలకలూరిపేట దగ్గర రోడ్డు ప్రమాదం
ఆటో-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. ఏడుగురి మృతి
ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
ప్రకాశం జిల్లా కొండముంజులూరులో బర్త్‌డే వేడుకల్లో పాల్గొని వస్తుండగా ప్రమాదం
-
Aug 27, 2026 06:54 IST
స్థిరంగా బంగారం ధరలు
24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,63,740
22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,50,090
కిలో వెండి ధర రూ.2,64,900