Share News

ఏబీఎన్ ఎఫెక్ట్.. పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజు రద్దు చేసిన ప్రభుత్వం

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:19 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌తో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొండలపై మైనింగ్ లీజును పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఏబీఎన్ ఎఫెక్ట్.. పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజు రద్దు చేసిన ప్రభుత్వం
Panchadarla Konda In Anakapalli District

అమరావతి, ఆగస్టు 27: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌తో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండల్లో గ్రావెల్ క్వారీ లీజుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొండలపై మైనింగ్ లీజును పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ కుమార్ నాయుడు దాసమన్నికి ఇచ్చిన 2.153 హెక్టార్ల క్వారీ లీజు రద్దుకు అనుమతి ఇచ్చింది. 14.05.2036 వరకు ఈ క్వారీ లీజు అమలులో ఉందని.. కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిని రద్దు చేస్తున్నట్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.


పంచదార్ల కొండలపై మైనింగ్ కార్యకలాపాలకు ఇక అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాంబిల్లి మండలం పంచదార్ల పుణ్యక్షేత్ర కొండలను ఇకపై నో మైనింగ్ జోన్‌‌గా ప్రకటించింది. గనుల తవ్వకాలతో పంచదార్ల ప్రాంత పర్యావరణ, పురావస్తు, జల వనరులు, ఆధ్యాత్మిక ప్రాధాన్యతకు ముప్పు ఉందని ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందజేశారు. మైనింగ్‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పలు శాఖల అధికారులతో సంయుక్తంగా ఈ కొండలపై తనిఖీలు నిర్వహించారు.


6వ జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సిఫార్సుల మేరకు కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణం, భూగర్భ జలాలు, పురావస్తు, మతపరమైన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో వివరించింది. ఇకపై పంచదార్ల కొండల్లో ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. తదుపరి చర్యలు చేపట్టాలని మైన్స్ అండ్ జియాలజీ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంచదార్ల కొండల మైనింగ్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు వెలువరించింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీటు కోసం పెద్దాయన మాస్ స్కెచ్.. వీడియో వైరల్

వరదల ప్రభావం లేదు.. క్షేమంగా ఉన్నాం: సతీష్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 04:36 PM