Share News

సీటు కోసం పెద్దాయన మాస్ స్కెచ్.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 27 , 2026 | 03:24 PM

రైలులో ప్రయాణించేటప్పుడు జనరల్ బోగీలో చోటు సంపాదించడం, ఆర్డినరీ బస్సులో సీటు సంపాదించడం చాలా కష్టం. అందులో ప్రయాణించే వాళ్లకే తెలుస్తోంది అది ఎంత కష్టమనేది.

సీటు కోసం పెద్దాయన మాస్ స్కెచ్.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: రైలులో ప్రయాణించేటప్పుడు జనరల్ బోగీలో చోటు సంపాదించడం, ఆర్డినరీ బస్సులో సీటు సంపాదించడం చాలా కష్టం. అందులో ప్రయాణించే వాళ్లకే తెలుస్తోంది అది ఎంత కష్టమనేది. ఒకొక్కసారి ఆ సీటు కోసం ప్రయాణికుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతుంటాయి. ఓ ముసలాయన సీటు కోసం కిటికిలో నుంచి బస్సులోకి వెళ్లారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.


ఈ వీడియోలో ఓ వృద్ధుడు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. బస్సు డోర్ వద్ద జనం భారీగా ఉండడంతో చివరకు ఆయన.. కిటికీ మార్గాన్ని ఎంచుకున్నారు. బస్సు టైర్లను ఆధారంగా చేసుకుని.. నేరుగా కిటికీలో నుంచి బస్సులోకి వెళ్లాడు. ఆయన ప్రయత్నాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.


ఈ వీడియోను vijayapur_talks28 ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇప్పటివరకూ లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వృద్ధుడిని కొంతమంది దేశీ స్పైడర్‌మ్యాన్‌ అని పిలుస్తున్నారు. ఆయన పిట్‌నెస్‌ను చూసి సూపర్‌హీరోలతో పోలుస్తున్నారు. ఈ రోజుల్లో యువకుడికి బస్సు ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుందని.. కానీ ఈ వృద్ధుడికి అలాంటివి ఏమీ లేవని నెటిజన్లు చెబుతున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 04:02 PM