Share News

వరదల ప్రభావం లేదు.. క్షేమంగా ఉన్నాం: సతీష్ రెడ్డి

ABN , Publish Date - Aug 27 , 2026 | 03:52 PM

భారీ వరదలతో నేపాల్ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వరదల వల్ల వంద మందికిపైగా మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వరదల ప్రభావం లేదు.. క్షేమంగా ఉన్నాం: సతీష్ రెడ్డి
DRDO Ex Chief Satish Reddy

ఇంటర్నెట్ డెస్క్: భారీ వరదలతో నేపాల్ పరిసర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వరదల వల్ల వంద మందికిపైగా మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక వందలాది మంది గల్లంతయ్యారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఆ జాబితాలో భారతీయులు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర కలత చెందుతున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే రంగంలోకి దిగి వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టింది.


ఈ నేపథ్యంలో టిబెట్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి స్పందించారు. ఆయన బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తాము వరదల్లో చిక్కుకోలేదన్నారు. తాము ఉన్న ప్రాంతంలో వరదల ప్రభావం లేదని తెలిపారు. తామంతా క్షేమంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్ చేరుకుంటామని సతీష్ రెడ్డి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీటు కోసం పెద్దాయన మాస్ స్కెచ్.. వీడియో వైరల్

వరదల ప్రభావం లేదు.. క్షేమంగా ఉన్నాం: సతీష్ రెడ్డి

For More TG News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 04:14 PM