అమరావతిలో ఆక్టేవ్, వీఐటీ-ఏపీ మధ్య అవగాహన ఒప్పందం
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:29 PM
అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, ఆక్టేవ్ సంస్థ మధ్య రెండేళ్ల అవగాహన ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం.
అమరావతి, ఆగస్టు 27: అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, ఆక్టేవ్ సంస్థ మధ్య రెండేళ్ల అవగాహన ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ (ML), సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో విద్యార్థులకు పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. ఈ ఒప్పందంలో భాగంగా ఆక్టేవ్‌కు చెందిన మెంటర్లతో కలిసి విద్యార్థులు ప్రాజెక్టులను రూపొందించనున్నారు. ప్రతి ప్రాజెక్టులో ఒక ప్రొఫెసర్‌తో పాటు నలుగురు విద్యార్థులు, ఇద్దరు మెంటర్లు ఉండనున్నారు. ప్రతి ప్రాజెక్టును మూడు నెలల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళికను రూపొందించారు.
అలాగే AI, MLకు సంబంధించిన పాఠ్యాంశాలపై వీఐటీ-ఏపీకి ఆక్టేవ్ సంస్థ సూచనలను అందించనుంది. విద్యార్థుల నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు హ్యాకథాన్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, కెరీర్ అవకాశాలకూ ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడమే ఈ అవగాహన ఒప్పందం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
నేపాల్ వరదలు.. ఏపీ యాత్రికుల క్షేమ సమాచారాలపై లోకేశ్ సమీక్ష
క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే ఊహాజనిత వ్యాఖ్యలు.. జగన్‌పై మంత్రి ఫైర్
Read Latest AP News And Telugu News