Share News

ఏఐసీసీ పరిధిలో కొండా సురేఖ ఎపిసోడ్... ఏ నిర్ణయమైనా స్వాగతిస్తాం: మహేశ్ గౌడ్

ABN , Publish Date - Aug 27 , 2026 | 04:03 PM

కొండా సురేఖ ఎపిసోడ్ ఏఐసీసీ పరిధిలో ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసీసీకి పంపించడం జరిగిందన్నారు.

ఏఐసీసీ పరిధిలో కొండా సురేఖ ఎపిసోడ్... ఏ నిర్ణయమైనా స్వాగతిస్తాం: మహేశ్ గౌడ్
Mahesh Kumar Goud

నిజామాబాద్, ఆగస్టు 27: మంత్రి కొండా సురేఖ అంశం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. దీనిపై సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వగా.. కుమార్తె కామెంట్స్‌కు తనను బాధ్యురాలిని చేయొద్దంటూ మంత్రి వివరణ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖ ఎపిసోడ్ ఏఐసీసీ పరిధిలో ఉందన్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసీసీకి పంపించడం జరిగిందని తెలిపారు.


కాంగ్రెస్ పార్టీలో ఎవరిపైనా కోపాలు, కక్షలు ఉండవని.. కొండా మురళి తనతో ఎలాంటి సంప్రదింపులు జరుపలేదని మహేశ్ స్పష్టం చేశారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. స్వాగతిస్తామని చెప్పారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత ప్రాధాన్యం ఏ పార్టీ ఇవ్వలేదన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో రాజీ ఉండదని తేల్చిచెప్పారు. తెలంగాణకు ఏ రకంగానూ అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. తనకు SIR నోటీసు అందిందని.. వివరాలు సమర్పిస్తానని ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్

హరీశ్ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు మాజీ మంత్రి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 04:39 PM