Share News

ధనవంతులను చేస్తామని నమ్మించి.. బాలికను వివస్త్రగా మార్చి..

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:37 AM

మైనర్‌ను వివస్త్రగా మార్చి పూజలు చేసిన అమానుష ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూజల పేరుతో బాలికను ఓ మహిళ చిత్రహింసలకు గురిచేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

ధనవంతులను చేస్తామని నమ్మించి.. బాలికను వివస్త్రగా మార్చి..
Ananthapur girl case

అనంతపురం, ఆగస్టు 27: మైనర్‌ను వివస్త్రగా మార్చి పూజలు చేసిన అమానుష ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పూజల పేరుతో బాలికను ఓ మహిళ చిత్రహింసలకు గురిచేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిరుపేద కుటుంబం కళ్యాణదుర్గం నుంచి జీవనోపాధి నిమిత్తం అనంతపురంలో నివాసముంటోంది. వీరి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఓ మహిళ మాయమాటలు చెప్పి అభంశుభం తెలియని బాలికను ఇబ్బందులకు గురిచేసింది. వివస్త్రగా పూజలు చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారంటూ బాలిక తల్లిదండ్రులకు మహాలక్ష్మి అనే మహిళ నమ్మించింది.


హేమంత్ కుమార్ అనే వ్యక్తి బాలికను ఓ రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి వివస్త్రను చేసి పూజలు చేశాడు. ఈ నెల 9న బాలిక, ఆమె తల్లిని సదరు మహిళ మరోసారి కడపకు తీసుకెళ్లి పూజల పేరుతో చిత్రహింసలకు గురిచేసింది. ఈ నెల 11న మరోసారి పూజల పేరుతో బాలికను, ఆమె తల్లిని కారులో తీసుకువెళ్తుండటాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక, ఆమె తల్లిని వదిలిపెట్టి సదరు మహిళ పరారైంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన కడప పోలీసులు.. అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితుల వివరాలను సేకరించిన పోలీసులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర విచారం

విశాఖలో లారీ డ్రైవర్‌పై దాడి ఘటన.. నిందితుడి అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 12:11 PM