Share News

క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే ఊహాజనిత వ్యాఖ్యలు.. జగన్‌పై మంత్రి ఫైర్

ABN , Publish Date - Aug 27 , 2026 | 02:33 PM

మాజీ సీఎం జగన్ వ్యవహార శైలితో వైసీపీ నాయకులతో పాటు క్యాడర్ కూడా విసిగిపోయి ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. క్యాడర్ చేజారకుండా ఉండేందుకే వారి తృప్తి కోసం జగన్ కొన్ని ఊహాజనిత కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు.

క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకే ఊహాజనిత వ్యాఖ్యలు.. జగన్‌పై మంత్రి ఫైర్
Minister Parthasarathy

అమరావతి, ఆగస్టు 27: మాజీ సీఎం జగన్ వ్యవహార శైలితో వైసీపీ నాయకులతో పాటు క్యాడర్ కూడా విసిగిపోయి ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. క్యాడర్ చేజారకుండా ఉండేందుకే వారి తృప్తి కోసం జగన్ కొన్ని ఊహాజనిత కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. బెంగళూరులో చల్లదనం వల్ల నిన్నటి వరకూ జగన్‌కు ఎల్‌నినో ప్రభావం తెలియలేదా అంటూ సెటైర్ విసిరారు. ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్నందున రాష్ట్ర పరిస్థితులపై జగన్ అవగాహన కోల్పోతున్నారన్నారు.


శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్‌కే మళ్లీ మళ్లీ శంకుస్థాపన చేయటం తప్ప రాయలసీమకు వైసీపీ అధినేత ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. విధ్వంసంతో 5 ఏళ్ల పాలన జగన్ సాగిస్తే, పునర్నిర్మాణంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిషేధిత సంస్థల మాదిరి జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేసి ఉంటే, ఎల్‌నినో ప్రభావం ఇంత ఉండేది కాదన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు వదలటాన్ని తప్పుపడుతున్న వైసీపీ నేతలు రైతు వ్యతిరేకులమని చాటుకుంటున్నారని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌.. ఆ సొత్తు మూలాలపై ఆరా

నేపాల్ వరదలు.. ఏపీ యాత్రికుల క్షేమ సమాచారాలపై లోకేశ్ సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 02:35 PM