ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:42 PM
తెలంగాణలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లపై ఇంధన భారం తగ్గించేలా కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026’కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..
హైదరాబాద్, ఆగస్టు 27: ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆటోరిక్షా డ్రైవర్లకు ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు ఈ పథకం కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
ఈ పథకం ద్వారా సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం పెరగనుంది. పెట్రోల్, డీజిల్ కోసం రోజూ అయ్యే ఖర్చుతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వ్యయం తగ్గే అవకాశం ఉండటంతో ఆటో డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరనుంది. రూ.200 కోట్ల నిధులతో 18,766 ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చే ప్రక్రియను ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read:
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు