Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 20 , 2026 | 07:19 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 20, 2026 09:13 IST

    సూర్యాపేట-ఖమ్మం హైవేపై కారులో అకస్మాత్తుగా మంటలు

    • పిల్లలమర్రి దగ్గర ఘటన, కారులో ఓ వ్యక్తి సజీవ దహనం

  • Sep 20, 2026 09:07 IST

    సిద్దిపేట జిల్లాలో నేడు మూడోరోజు కాంగ్రెస్‌ నేతల పర్యటన

    • అజీజ్‌నగర్‌, మొయినాబాద్‌ వెళ్లనున్న కాంగ్రెస్‌ నేతలు

    • హరీష్‌రావు, పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్‌ నేతలు

  • Sep 20, 2026 09:01 IST

    జర్నలిస్ట్ పాయల్ మెహతా ఆకస్మిక మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

    • పాయల్ మెహతా నిజాయతీ, అంకితభావంతో పనిచేసే జర్నలిస్టు: చంద్రబాబు

    • ఏపీలో క్షేత్రస్థాయి వార్తల కోసం పాయల్ మెహతా ఎంతో శ్రమించారు: చంద్రబాబు

    • పార్లమెంట్‌లో కలిసిన సందర్భాల్లో తాజా పరిణామాలను పంచుకునేవారు: చంద్రబాబు

    • పాయల్ మెహతా కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి: చంద్రబాబు

  • Sep 20, 2026 08:54 IST

    విదేశాల్లో పౌరులకు అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలు

    • సౌదీ అరేబియా, ఎయిర్‌పోర్టులు లక్ష్యంగా హూతీల దాడులు

    • అమెరికా రాయబార కార్యాలయాలపైనా దాడులు జరిగే చాన్స్

    • విదేశాల్లో ఉన్న అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచన

  • Sep 20, 2026 08:36 IST

    సౌదీ అరేబియాపై హూతీల క్షిపణి దాడులు

    • అరామ్‌కో చమురులో భారీగా చెలరేగిన మంటలు

    • హూతీల దాడులను తిప్పికొట్టిన సౌదీ దళాలు

    • సౌదీ అరేబియాకుల టర్కీ సైనిక మద్దతు

  • Sep 20, 2026 08:28 IST

    పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు

    • ఇరాన్‌లో 'కోడ్‌ 100' అత్యవసర అలర్ట్‌

    • ఇరాన్‌ సాయుధ బలగాలకు కీలక ఆదేశాలు

    • అమెరికా పర్యటన మధ్యలోనే ముగించుకుని ఇజ్రాయెల్‌‌కు తిరుగుపయనమైన నెతన్యాహు

  • Sep 20, 2026 08:14 IST

    కరీంనగర్ జిల్లాలో దొంగల హల్‌చల్

    • దురిషేడ్‌లో ఎస్బీఐ ఏటీఎంను టార్గెట్ చేసిన దుండగులు

    • వేకువజామున 3 గంటలకు లేడీ గెటప్‌లో వచ్చి సీసీటీవీ కెమెరాలపై స్ప్రే కొట్టి చోరీకి పాల్పడిన దొంగలు

  • Sep 20, 2026 08:02 IST

    నేడు కాకినాడకు మంత్రి నారా లోకేశ్

    • చాగంటి కోటేశ్వరరావు గోశాల ప్రాంగణంలో విద్యార్థులతో వ్యక్తిత్వ వికాసం కార్యక్రమం

    • కార్యక్రమంలో పాల్గొననున్న నారా లోకేశ్

  • Sep 20, 2026 07:38 IST

    రంగారెడ్డి: పహాడీ షరీఫ్‌ పీఎస్‌ పరిధిలో 17 ఏళ్ల యువకుడిపై హత్యాయత్నం

    • జల్‌పల్లిలో రహీముద్దీన్‌పై ఆసిఫ్(22), ఫయాజ్(20) అనే యువకుల దాడి

    • మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు రహీముద్దీన్

  • Sep 20, 2026 07:37 IST

    హైదరాబాద్: నేడు శంషాబాద్‌కు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల బృందం

    • జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్‌ బృందం

    • హరీశ్‌రావు ఫామ్‌హౌస్‌కూ కాంగ్రెస్‌ బృందం వెళ్లే అవకాశం

  • Sep 20, 2026 07:36 IST

    విశాఖ నీటి సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్‌

    • నీటి సరఫరాపై నేడు విజయవాడలో కీలక భేటీ

    • ట్యాంకర్లతో నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

    • ఎర్రవరం-ఏలేరు నీటిసరఫరాపై ప్రత్యేక దృష్టి

  • Sep 20, 2026 07:35 IST

    తిరుపతి: తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు

    • ఉదయం హనుమంత వాహన సేవ

    • సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవ

  • Sep 20, 2026 07:33 IST

    హైదరాబాద్‌: పాతబస్తీ యూకుత్‌పురాలో రోడ్డు ప్రమాదం

    • కారు ఢీకొని మూడేళ్ల బాలుడు ఇజాన్‌ ఉద్దీన్‌ మృతి

    • పరారీలో కారు డ్రైవర్‌, గాలిస్తున్న పోలీసులు

  • Sep 20, 2026 07:32 IST

    మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు

    • ఈ నెల 28 నుంచి 30 వరకు మూడురోజుల పాటు యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ సమ్మె

    • ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలు సహా పలు సమస్యలను పరిష్కరించాలని UFBU డిమాండ్‌

    • సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఎస్‌బీఐ అడ్వైజరీ

    • ఖాతాదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన

  • Sep 20, 2026 07:30 IST

    ఏపీ సీఎం చంద్రబాబు నేడు బెంగళూరు పర్యటన

    • ‘ది ఎర్త్ సెంటర్–విస్టా స్పేసెస్’ ప్రారంభోత్సవానికి హాజరు

  • Sep 20, 2026 07:26 IST

    మేడ్చల్ మల్కాజిగిరి: జవహర్‌ నగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం

    • స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరి మృతి

  • Sep 20, 2026 07:24 IST

    బంగాళాఖాతం ఉత్తర అండమాన్‌ సమీపంలో అల్పపీడనం

    • మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం

    • మరో మూడు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం

    • ఉత్తర కోస్తా దిశగా కదిలి ఈ నెల 23న తీరం దాటే అవకాశం

    • అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ