అదే సస్పెన్స్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ఇంకా తేల్చని బీఆర్‌ఎస్, బీజేపీ
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:21 AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై బీఆర్‌ఎస్, బీజేపీ స్ప ష్టత ఇవ్వకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్, జనసేన, టీఆర్‌ఎస్, టీఆర్‌పీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు
సమావేశాలు, ఇన్‌చార్జీల నియామకాలతోనే సరిపెడుతున్న గులాబీ పార్టీ
విభేదాలతో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపికలో జాప్యమవుతోందనే ప్రచారం
ఎమ్మెల్సీ పోరుపై పెద్దగా దృష్టిపెట్టని బీజేపీ
జనసేనకు మద్దతుపై ఊహాగానాలతో ‘కమలం’ క్యాడర్‌లో కలవరం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై బీఆర్‌ఎస్, బీజేపీ స్ప ష్టత ఇవ్వకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ తో పాటు జనసేన, టీఆర్‌ఎస్, టీఆర్‌పీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కావడంతో వారు ప్రచార పర్వంలోకి రావడంతో ఎన్నికల సమీకరణాలు వేగంగా మా రుతున్నాయి. బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమావేశా లు, ఇన్‌చార్జిల నియామకాలకే పరిమితమవు తుండగా, అభ్యర్థి ఎంపికపై పదేపదే వాయిదా వేయడంపై గులాబీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మరోవైపు బీజేపీ సొంతంగా అభ్యర్థిని నిలుపుతుందా లేక జనసేనకు మద్దతు ఇస్తుందా? అనేది సందిగ్ధంగా మారింది. ఇప్పటి వరకు అభ్యర్థి ఎంపికతో పాటు ఎన్నికల ప్రక్రియపై కాషాయ పార్టీ సీరియస్‌గా ముందుకు వెళ్లడం లేదనే అభిప్రాయాలు క్యాడర్‌లో వ్యక్తం అవుతున్నాయి.
గులాబీలో ఉత్కంఠ
బీఆర్‌ఎస్‌లో విభేదాలతో వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో ఆలస్యం అవుతోంది. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్ సీరియస్‌గా దృష్టి పెట్టింది. 2024 జూన్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఓటమిని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. 2009 నుంచి ప్రతీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నప్పటికీ ఉప ఎన్నికల్లో ఓటమి గులాబీ పార్టీ క్యాడర్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ క్రమం లో తిరిగి పట్టభద్రుల స్థానంలో పాగా వేయాలని బీఆర్‌ఎస్ అధిష్ఠానం పట్టుదలగా ఉంది. దీంతో ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిలను పార్టీ నియమించింది. అలాగే నియోజకవర్గ స్థాయి సమావేశాలను కూడా నిర్వహిస్తోంది. అయితే స్థానిక నేతల మధ్య విభేదాలు అభ్యర్థి ఎంపికపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
గత ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన ఏనుగుల రాకేష్‌రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం పట్టు పడుతోంది. అయితే మరోవర్గం నేతలు వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవరెడ్డిని బరిలో దించాలని పట్టుబడు తున్నట్లుగా సమాచారం. ఇద్దరితో పాటు కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గాన్ని బరిలోకి దించడంతో బీఆర్‌ఎస్ నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దించితే ఎలా ఉంటుందనే కోణం లో అధిష్ఠానం సర్వేలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. బీసీ అభ్యర్థిని బరిలో దించితే రెండు వర్గాలకు చెక్ పెట్టినట్లు అవుతుంద నే చర్చ ఉంది. కానీ, మూడు ఉమ్మడి జిల్లా లను ప్రభావితం చేసే బీసీ నేతలు ఎవరు ఉన్నారనేది గులాబీ పార్టీలో చర్చ జరుగు తోందని సమాచారం. ఈ నేపథ్యంలో అభ్య ర్థి ఎంపికపై జాప్యం అవుతోందనే అభిప్రా యాలు ఉన్నాయి. మరోవైపు రాకేష్‌రెడ్డి అన్ని ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న సమా వేశాల్లో పాల్గొంటుండటంతో ఆయనే అభ్యర్థి అనే ప్రచారం క్యాడర్‌లోకి వెళుతోంది.
బీజేపీలో సందిగ్ధం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్సీగా పో టీచేసేందుకు పలువురు అభ్యర్థులు ఉత్సా హంగా ఉన్నప్పటికీ అధిష్ఠానం ఎటు తేల్చ కపోవడంతో క్యాడర్‌లో అయోమయం నెల కొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. అదేస్థాయిలో కాషాయ పార్టీలో ఓటరు నమోదు జరగడం లేదు. జనసేన అభ్య ర్థి బరిలో ఉండటంతో పాటు బీజేపీ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దించుతుందా? లేక జనసేనకు మద్దతు ఇస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం అభ్యర్థిని పోటీలో ఉంచాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నాయి. వరంగల్ నుంచి బీసీ కోటాలో వన్నాల వెంకటరమణ టికెట్ ఆశిస్తుండగా, మహిళా కోటాలో రాణి రుద్రమదేవి పేరు వినిపిస్తోంది. వీరి తో పాటు మరికొంతమంది ఆశావహులు ఎమ్మెల్సీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అధిష్ఠానం పోటీపై స్పష్టత ఇవ్వకపోవడంతోపాటు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంపై క్యాడర్‌లో అందోళన నెలకొంది.
ప్రచారంలోకి కాంగ్రెస్, జనసేన, టీఆర్‌ఎస్, టీఆర్‌పీ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే సూర్యాపేటకు చెందిన రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం నియోజకవర్గాలవారీగా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, న్యాయవాదులు తదితర వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారాన్ని ఉధృతం చేశారు. కాంగ్రెస్ పార్టీకి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారంలోకి దిగుతుండటంతో క్యాడర్‌లో జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్‌తో పాటు జనసేన అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాస్‌రావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కేయూతోపాటు వైద్యులు, న్యాయవాదులను కలిసి ప్రచారం నిర్వహించారు. అలాగే టీఆర్‌ఎస్ అభ్యర్థి నలమాస శ్రీకాంత్‌గౌడ్ వరంగల్‌లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. కోర్టులు, విద్యాసంస్థల్లో అధ్యాపకులను కలిసి ప్రచారం చేపట్టారు. అలాగే టీఆర్‌పీ అభ్యర్థి పాలకుర్తి అశోక్‌గౌడ్ వరంగల్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల్లోని గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుస్తున్నారు. దీంతో రోజురోజుకూ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
42 రోజులకే నీళ్లు..సీటీలో 3లక్షల కనెక్షన్లకు నీటి కటకట తప్పదా?
ఫ్లాట్లు నిర్మించకుండానే రిజిస్ట్రేషన్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News