మోపిదేవి ఆలయంలో నాగులచవితి వేడుకలు.. తరలివస్తున్న భక్తులు
ABN , Publish Date - Nov 13 , 2026 | 09:54 AM
కృష్ణా జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాగులచవితి వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు(శుక్రవారం) ఉదయం ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు ఈ వేడుకలను ప్రారంభించారు.
కృష్ణా జిల్లా, నవంబర్ 13: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాగులచవితి వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు(శుక్రవారం) ఉదయం ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు ఈ వేడుకలను ప్రారంభించారు. నాగులచవితిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. పుట్టలో పాలు పోసేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా నాగులచవితి వేడుకలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెల్లజామునే భక్తులు స్నానాలు ఆచరించి సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయాలు, నాగదేవత విగ్రహాలు ఉన్న ఆలయాలకు చేరుకుంటున్నారు. పుట్టకు పసుపు, కుంకుమ రాసి పూజలు చేసి.. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నాగదేవతకు ప్రీతికరమైన పాలు, నువ్వుల పిండి, పెసరపప్పులను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అనంతరం వాటిని ప్రసాదంగా భావించి పంచిపెడుతున్నారు. నాగులచవితిని పురస్కరించుకుని నాగదేవతకు ప్రతీకగా భావించే పుట్టల వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!
విమానాశ్రయాలతో ఆర్థిక ప్రగతి: జీఎంఆర్
Read Latest AP News And Telugu News