ప్రేమ వివాహం చేసుకుంటానన్న కూతురు.. చున్నీతో ఉరేసి చంపిన తండ్రి..
ABN , Publish Date - Nov 13 , 2026 | 09:53 AM
వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడమే ఆమె పాలిట శాపమైంది. కన్న కూతురి ప్రేమ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన కూతురి చున్నీతోనే ఆమె గొంతు బిగించి హత్య చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడమే ఆమె పాలిట శాపమైంది. కన్న కూతురి ప్రేమ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన కూతురి చున్నీతోనే ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడింది. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది (Gujarat Honour Killing).
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా ఖంభాత్ తాలూకా మెట్పూర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల సానియా పటేల్ బీకాం పూర్తి చేసింది. తన గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఆమె సుమారు ఏడాది కాలంగా ప్రేమలో ఉంది. అతడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. సానియా ప్రేమ వ్యవహారం తండ్రి కౌశల్‌కుమార్ పటేల్‌కు నచ్చలేదు. యువకుడు వేరే కులానికి చెందినవాడు కావడంతో పాటు అతడి సంపాదన కూడా తక్కువగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశాడు (Gujarat Crime News).
ఆ యువకుడితో మాట్లాడటం ఆపేయాలని, అతడితో సంబంధాన్ని తెంచుకోవాలని సానియాకు కౌశల్ పలుసార్లు చెప్పాడు (Inter Caste Relationship). కానీ సానియా మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. యువకుడితో ఫోన్‌లో మాట్లాడటం కొనసాగించింది. ఈ క్రమంలో నవంబర్ 9 తెల్లవారుజామున మరోసారి ఇదే విషయంపై తండ్రీకూతుళ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో సానియాను ఆమె చున్నీతోనే తండ్రి హత్య చేశాడు. ఆ హత్యను సహజ మరణంగా చూపించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే ఆమె మెడపై ఉన్న గాయాలను పరిశీలించిన వైద్యులు.. పోస్ట్‌మార్టం నిర్వహించి హత్య అని తేల్చారు. విచారణలో కౌశల్ తన కూతురిని హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!
న్యూజిలాండ్ ఓపెనర్ హాఫ్ సెంచరీ.. 15 ఓవర్లకు కివీస్ స్కోరు 75/2