Share News

మారీచుడిలా జగన్ వేషాలు మార్చారు.. మంత్రి డీబీవీ స్వామి ఎద్దేవా

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:46 PM

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం పాకులాడుతూ జగన్ కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

మారీచుడిలా జగన్ వేషాలు మార్చారు.. మంత్రి డీబీవీ స్వామి ఎద్దేవా
AP Minister Bala Veeranjaneya Swamy

ప్రకాశం, జులై 2 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (AP Minister Bala Veeranjaneya Swamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం పాకులాడుతూ జగన్ కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు (గురువారం) ప్రకాశం జిల్లాలో మంత్రి డీబీవీ స్వామి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మారీచుడిలా జగన్ వేషాలు మార్చారని సెటైర్లు గుప్పించారు. గతంలో అమరావతికి సపోర్టుగా ఉంటానని చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుముక్కలు అన్నారని.. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ రాజధానిని అమరావతిగా చట్టం చేశామని తెలిపారు. అమరావతి రాజధానిగా పార్లమెంట్‌లో ఉభయ సభలు ఆమోదించాయని వివరించారు. జగన్ ఇప్పుడు ఏం చేయగలరని ప్రశ్నించారు.


జగన్ అజెండా మోసం చేయడమే..

జగన్ అజెండా మోసం చేయడమేనని.. ఆయన ఆచరణ వంచించడమేనని మంత్రి డీబీవీ స్వామి వ్యగ్యంగా అన్నారు. జగన్ మాటలకు చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని.. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పుకొచ్చారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర అందించాలని వ్యాపారులను ఆదేశించామని అన్నారు. ఆచరణలో కొంత గ్యాప్ ఉందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి దాన్ని సరిచేస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్

అకారణంగా నన్ను సాయికృష్ణ కేసులో ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు: నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 02 , 2026 | 01:04 PM