రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసిన మహానేత ఎన్టీఆర్: దేవినేని ఉమ
ABN , Publish Date - May 28 , 2026 | 10:25 AM
మాజీ సీఎం నందమూరి తారక రామారావు 103వ జయంతిని గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు పూలమాలవేసి ఆయన సేవలను కొనియాడారు.
ఎన్టీఆర్ జిల్లా, మే 28 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 103వ జయంతిని గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) పాల్గొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు పూలమాలవేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. రాముడుగా, కృష్ణుడుగా చెరగని ముద్ర వేసి రాజకీయ రంగంలో ధ్రువతారగా వెలిగారని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ‘ఆత్మగౌరవాన్ని’ పరిచయం చేసిన ధీరుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడని ఉద్ఘాటించారు.
వైసీపీ నేతలకు ప్రజలే గట్టి బుద్ధి చెప్పారు..
టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పార్టీని కాపాడి.. 44 ఏళ్లుగా బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఘన విజయం సాధించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ‘మీకోసం వస్తున్నా’ పాదయాత్రతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి 2014లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారని ప్రస్తావించారు. అసత్య ప్రచారాలతో వచ్చిన వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. గుడివాడ వైసీపీ నేతలు ఇప్పటికీ అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలను అవమానించిన, దుర్భాషలాడిన వైసీపీ నేతలకు ప్రజలే గట్టి బుద్ధి చెప్పారని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని ఉద్ఘాటించారు.
23 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా..
కూటమి ప్రభుత్వం 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి.. 23 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని దేవినేని ఉమ తెలిపారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదాన్ని, చంద్రబాబు ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి చాటారని వెల్లడించారు. యువగళం ద్వారా లోకేశ్ మూడోతరం నాయకత్వాన్ని నిరూపించుకుని పార్టీని విజయపథంలో నడిపిస్తున్నారని చెప్పారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో అభివృద్ధి పనులు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా మరిన్ని సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, బ్లడ్ బ్యాంక్, సంజీవని వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సమన్వయంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
మహానాడులో లోకేశ్ సంచలన నిర్ణయం... మహిళలకు 33శాతం మహిళా రిజర్వేషన్ల ప్రతిపాదన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News