విజయవాడ - దువ్వాడ మధ్య 20 రైళ్ల రద్దు
ABN , Publish Date - Apr 09 , 2026 | 07:51 AM
విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వేయార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు రైల్వేయార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. మరో 10 రైళ్లను దారిమళ్లించడంతో పాటు 2 రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. రద్దు అయిన వాటిల్లో సికింద్రాబాద్-విజయవాడ- (శాతవాహన),
గుంటూరు-సికింద్రాబాద్ (గోల్కొండ), విజయవాడ- భద్రాచలం (మెమో), విజయవాడ-డోర్నకల్ (మోమో), విశాఖపట్నం-మహబూబ్‌నగర్ (విశాఖ), కాకినాడ-లింగంపల్లి(గౌతమి), సంబల్‌పూర్-నాందేడ్ (నాగావళి), నాందేడ్-విశాఖపట్నం- సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య
Read Latest Telangana News and National News