Peddapalli: ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:25 AM
పెద్దపల్లి, ఏప్రిల్ 8 (ఆంఽధ్రజ్యోతి): నిజాలను నిర్భయంగా వెల్లడించే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్ కార్యాలయం పై వైసీపీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు.
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి
పెద్దపల్లి, ఏప్రిల్ 8 (ఆంఽధ్రజ్యోతి): నిజాలను నిర్భయంగా వెల్లడించే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్ కార్యాలయం పై వైసీపీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు. బుధవారం ఆయన పెద్ద పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందడాన్ని వైసీపీ నేతలు జీర్జించుకోవడం లేద న్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరా వతిని చంద్రబాబు తీర్చిదిద్దితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మూడు ముక్కలు చేశారన్నారు. ఆ చర్యను సహించని ఆంధ్రా ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి కర్రు కాల్చి వాతలు పెట్టినా కూడా బుద్ధి రావడం లేదన్నారు. ఇప్పుడు ‘మావిగన్’ పేరిట కొత్త రాగం తీస్తు న్నారని అన్నారు. మావిగన్‌ను ఆంధ్రా ప్రజలు వ్యతిరేకించడం, అమరావ తికి చట్టబద్ధత కల్పించడపై హర్షం వ్యక్తం అవుతుండడంపై ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ రాసిన కథనాన్ని జీర్జించుకోలేని వైసీపీ మూకలు గుండాల్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వారి తీరు జుగుప్సాక రంగా ఉందని, బెదిరింపులకు పాల్పడి మీడియాను లొంగదీసుకోవాలని చూస్తున్నారని అన్నారు. బెదిరిపులకు బెదరని దమ్మున్న చానల్ ‘ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి’కి సంఘీభావం ప్రకటిస్తున్నామని తిరుపతి అన్నారు. సమా వేశంలో కోళ్ల కిషన్‌రావు, పెర్క శ్రీనివాస్ పాల్గొన్నారు.