Share News

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మళ్లీ హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..

ABN , Publish Date - Apr 09 , 2026 | 07:04 AM

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా, ఇరాన్‌లు బుధవారం రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించాయి. దీనిలో భాగంగా, ప్రపంచ ఇంధన సరఫరాలను పునరుద్ధరించేందుకు వీలుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించింది.

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మళ్లీ హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..
Iran closes Hormuz

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ మరోసారి హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా, ఇరాన్‌లు బుధవారం రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించాయి. దీనిలో భాగంగా, ప్రపంచ ఇంధన సరఫరాలను పునరుద్ధరించేందుకు వీలుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అమెరికా తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మద్దతు తెలిపారు. అయితే లెబనాన్‌తో కాల్పుల విరమణ ఉండదని చెప్పారు (Iran closes Hormuz).


లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. పది నిమిషాల వ్యవధిలో లెబనాన్‌లోని ప్రలు ప్రాంతాలపై సుమారు 100 ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో దాదాపు 180 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 837 మంది గాయాల పాలయ్యారు. 1982 తర్వాత లెబనాన్‌పై జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. లెబనాన్‌పై దాడులకు నిరసనగా ఇరాన్.. హోర్ముజ్ జలసంధిని తిరిగి మూసేసింది (Israel Lebanon strikes).


అమెరికా- ఇరాన్ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో హిజ్బుల్లాను చేర్చలేదని పేర్కొంటూ, లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యకు ట్రంప్ మద్దతు తెలిపారు (US Iran ceasefire risk). 'లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యను ఒప్పందం నుంచి ఎందుకు మినహాయించార'ని ప్రశ్నించగా.. 'హిజ్బుల్లా కారణంగానే లెబనాన్‌ను ఒప్పందంలో చేర్చలేదు. అది కూడా త్వరలోనే పరిష్కారమవుతుంది. ఫర్వాలేదు' అని ట్రంప్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణపట్నం పోర్టులోకి తమిళనాడు బోటు అక్రమ చొరబాటు.. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్

రూ.185 కోట్లతో విజయవాడ స్టేడియం అభివృద్ధి: మంత్రి మండిపల్లి..

Updated Date - Apr 09 , 2026 | 07:04 AM