Share News

కృష్ణపట్నం పోర్టులోకి తమిళనాడు బోటు అక్రమ చొరబాటు.. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:39 PM

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సముద్ర తీరంలోకి అక్రమంగా చొరబడిన తమిళనాడుకు చెందిన ఒక బోటును టాస్క్ ఫోర్స్ బృందాలు పట్టుకున్నాయి. వివరాల్లోకి వెళితే..

కృష్ణపట్నం పోర్టులోకి తమిళనాడు బోటు అక్రమ చొరబాటు.. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్
Krishnapatnam port news

నెల్లూరు, ఏప్రిల్ 8: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సముద్ర తీరంలోకి అక్రమంగా చొరబడిన తమిళనాడుకు చెందిన ఒక బోటును టాస్క్ ఫోర్స్ బృందాలు పట్టుకున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు తీర ప్రాంతంలో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. నిరంతర నిఘా కొనసాగుతున్న వేళ, ఈ చొరబాటు కలకలం రేపింది.


గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం తీరంలో అక్రమ రాకపోకలు పెరగడంతో టాస్క్‌ఫోర్స్ బృందాలు గస్తీని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా పట్టుబడిన బోటుతో కలిపి ఇప్పటి వరకు మొత్తం నాలుగు బోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల వరుసగా మూడు బోట్లను పట్టుకోగా, తాజాగా నాలుగో బోటు చిక్కింది. పట్టుబడిన ఈ బోట్లన్నింటినీ భద్రతా కారణాల దృష్ట్యా జువ్వలదిన్నె హార్బర్‌కు తరలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు 24 గంటల పాటు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారు. ఆధునిక పరికరాలు, నిఘా నేత్రాల సహాయంతో అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చొరబాటుదారుల ఆటకట్టిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైల్వే బ్రిడ్జి పనులు చేస్తూ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు..

రూ.185 కోట్లతో విజయవాడ స్టేడియం అభివృద్ధి: మంత్రి మండిపల్లి..

For More TG News And Telugu News

Updated Date - Apr 08 , 2026 | 06:00 PM