Share News

రైల్వే బ్రిడ్జి పనులు చేస్తూ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు..

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:14 PM

కొమురం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో కార్మికులకు ప్రమాదం జరిగింది. థర్డ్ లైన్ పనులు చేస్తూ ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

రైల్వే బ్రిడ్జి పనులు చేస్తూ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు..
Asifabad Bridge Accident

కొమురం భీమ్ ఆసిఫాబాద్‌: కాగజ్‌నగర్‌ పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనులు చేస్తుండగా కార్మికులకు ప్రమాదం జరిగింది. థర్డ్ లైన్ పనులు చేస్తూ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పనులు చేస్తూ ప్రమాదవశాత్తూ జారిపడి బాక్స్ బ్రిడ్జ్‌లో ఇద్దరు కార్మికులు ఇరుక్కుపోయారు. ఒకరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు తోటి కార్మికులు. బ్రిడ్జి మధ్యలోనే మరొకరు ఇరుక్కుపోయారు. అతన్ని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ భవన్‌ ముట్టడికి ఉద్యమకారుల జేఏసీ యత్నం.. ఉద్రిక్తత

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Updated Date - Apr 08 , 2026 | 03:16 PM