యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 25 , 2026 | 08:00 PM
యలహంక ప్యాలెస్ వివాదంపై పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్యాలెస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యక్తిగత అంశమని పేర్కొన్నారు.
ఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): యలహంక ప్యాలెస్ వివాదంపై పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijay Sai Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్యాలెస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యక్తిగత అంశమని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. గతంలో వాళ్లకు ఆడిటర్‌గా తాను పని చేశానని ప్రస్తావించారు. ఈ విషయంపై తాను మాట్లాడటం సరికాదని చెప్పుకొచ్చారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిప్రాయం ఏంటనేది జగన్, వారి కుటుంబ సభ్యులు, తనకు, కేవీపీలకు మాత్రమే తెలుసునని చెప్పుకొచ్చారు.
ఆ ప్యాలెస్ వైఎస్ కుటుంబ వ్యక్తిగత అంశం..
యలహంక గురించి తాను, కేవీపీ మాత్రమే అసలైన విషయాలను చెప్పగలమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆ ప్యాలెస్ గురించి తాను చెప్పడం సమంజసం కాదని అన్నారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ ప్యాలెస్ వైఎస్ కుటుంబ వ్యక్తిగత అంశమని.. పూర్తి విషయాలు తెలిసినా.. తాను మాట్లాడనని అన్నారు. యలహంక ప్యాలెస్‌పై బయట జరుగుతున్న చర్చలు అవాస్తవమని తెలిపారు. వైఎస్ కుటుంబంలో ఏం జరిగిందనేది తనకు, కేవీపీకి మాత్రమే తెలుసునని.. కానీ ఈ విషయాలు తాను వెల్లడించలేనని అన్నారు. ఆస్తుల వ్యవహారం వ్యక్తిగతమని చెప్పారు. ఆస్తుల విషయంలో కోర్టు నోటీసులు ఇస్తే చెప్పాల్సిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News