మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:49 PM
కాకినాడ జిల్లాకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా అధికారులకు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయంపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) స్పందించారు. ఈ సందర్భంగా అధికారులకు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయంపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారుల బోటు ఆచూకీ కనుగొనేందుకు తీసుకుంటోన్న చర్యల గురించి ఆరా తీశారు.
మోటరైజ్డ్ ఫిషింగ్ బోటులో నవంబరు 4వ తేదీన చేపల వేటకు ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు వెళ్లిన విషయం తెలిసిందే. వేటకు వెళ్లిన బోటు పారాదీప్ పోర్టు సమీపానికి చేరుకున్నాక వారి సమాచారం తెలియలేదు. 19వ తేదీ నుంచి వారి బోటుతో సంబంధాలు తెగిపోయాయి. ఈ సమాచారం అందిన వెంటనే కాకినాడ, చెన్నై, ఒడిశాలోని కోస్ట్‌గార్డ్ స్టేషన్ల అధికారులతో.. ఏపీ యంత్రాగం సంప్రదింపులు జరిపి, గాలింపు చర్యలు చేపట్టింది. ఈ విషయంపై భారత కోస్ట్‌గార్డ్‌కు కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారులు లేఖ రాశారు. గల్లంతైన మత్స్యకారుల వద్ద మొబైల్ ఫోన్లు, బోటులోని ట్రాన్స్‌పాండర్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉందని అధికారులు తెలిపారు. జీపీఎస్ ద్వారా కూడా బోటు సమాచారం తెలియలేదని అధికారులు సీఎంకు చెప్పారు.
భారత కోస్ట్‌గార్డ్ వారి నౌకలు, హెలికాఫ్టర్ సహాయంతో పారాదీప్ తీర ప్రాంతంలో గల్లంతైన బోటు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏపీ అధికారులు వివరించారు. మత్స్యకార కుటుంబాలను తాము కలిశామని.. ఆ తర్వాత మత్స్యశాఖ, కోస్ట్‌గార్డ్ అధికారులతో మాట్లాడామని కాకినాడ అధికారులు సీఎంకు తెలిపారు. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని... ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
మత్స్యకారుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి: మంత్రి అనిత

కాకినాడ జిల్లాకు చెందిన మత్స్యకారుల బోటు ఆచూకీ లభించకపోవడంపై అధికారులతో ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవంబరు 4వ తేదీన చేపల వేటకు ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు వెళ్లిన విషయం తెలిసిందే. మోటరైజ్డ్ ఫిషింగ్ బోటులో సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లారు.
గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని కాకినాడ అధికారులు తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ కోసం అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు వివరించారు. గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అనిత చెప్పారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారని హోం మంత్రి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు
ఏపీని మారిటైం, ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్
నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News