Share News

పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 23 , 2026 | 02:44 PM

ప్రజలకు మెరుగైన సేవలే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సీఎం చంద్రబాబు సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన సేవలే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. రియల్ టైమ్ గవర్నెన్సులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సీఎం చంద్రబాబు ఈరోజు (సోమవారం) రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు సాంఘిక, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖలు, ఆర్థిక శాఖ, మున్సిపల్, ఇంధన శాఖ, ఆర్టీజీఎస్ అధికారులు హాజరయ్యారు.


వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందిస్తున్న పౌర సేవలను మరింత మెరుగ్గా మార్చే అంశంపై సీఎం మార్గనిర్దేశం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ ద్వారా ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచాలని ప్రభుత్వ శాఖలకు సూచించారు. ప్రభుత్వం అందించే సేవలపై సానుకూల ప్రజాభిప్రాయంతోనే మరింత మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. పర్యవేక్షణా లోపాలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్

వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు

ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 03:29 PM