Share News

గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Nov 22 , 2026 | 04:36 PM

ఏపీలో మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో కూటమి పక్షాలు సాధించిన అఖండ విజయం స్ఫూర్తిని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. మూడు విడతల్లోనూ ఎన్నికలు సామరస్యంగా జరిగేలా చూడాలని సూచించారు.

గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏపీలో మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో కూటమి పక్షాలు సాధించిన అఖండ విజయం స్ఫూర్తిని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దిశానిర్దేశం చేశారు. మూడు విడతల్లోనూ ఎన్నికలు సామరస్యంగా జరిగేలా చూడాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జనసేన ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ ఈరోజు (ఆదివారం) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.


సన్నద్ధంగా ఉండాలి..

ఈ సందర్భంగా జనసేన కేడర్‌కు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 26వ తేదీన జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు జనసేన శ్రేణులు, నాయకులు సర్వ సన్నద్ధంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఎన్నికల అనంతరం కూడా గ్రామాల్లో ప్రశాంత పరిస్థితి ఉండే విధంగా ఈ ఎన్నికలు సాగాలని సూచించారు. కూటమి పక్షాల ఐక్యతకు ఈ ఎన్నికలు ఒక నిదర్శనంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల సందర్భంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

స్థానిక ఎన్నికల్లో 90 శాతం పైగా స్ట్రైక్ రేట్ సాధించాం: సీఎం చంద్రబాబు

ప్రకాశం జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి

అమరావతిని బెస్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 05:34 PM