అమరావతిని బెస్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:20 PM
రాజధాని అమరావతి పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిని బెస్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నామని ఉద్ఘాటించారు.
అమరావతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. అమరావతిని బెస్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నామని ఉద్ఘాటించారు. రాజధాని మనకు ఒక అడ్రస్ అని వివరించారు. ఈరోజు (శనివారం) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతిలో 36 ప్రాజెక్టులను మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకు టైమ్ బౌండ్ షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. ఉద్యోగస్తులు కూడా చాలా బాగా పని చేస్తున్నారని అభినందించారు. ఎవరైనా లాస్ట్ మైల్‌లో ఉంటే వారిని కూడా మోటివేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు.
నెలకు నాలుగు రోజులు ప్రజల్లో ఉంటా...
నెలకు నాలుగు రోజులు ప్రజల్లో తాను ఉంటానని ముఖ్యమంత్రి వివరించారు. పెన్షన్లు, ల్యాండ్ రికార్డ్స్, పరిశుభ్రత, సంజీవని ప్రాజెక్టుల ద్వారా తాను ప్రజల వద్దకు నాలుగు సార్లు వెళ్తున్నానని తెలిపారు. కేంద్రప్రభుత్వం కూడా తమకు బాగా సహకరిస్తోందని చెప్పారు. 90 కేంద్ర పథకాలను కూడా రాష్ట్రంలో అమలు చేస్తున్నామని వివరించారు. కేంద్ర పథకాలను వైసీపీ హయాంలో పూర్తిగా నిలిపివేశారని ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలకు వచ్చిన నిధులను మళ్లించారని ఆగ్రహించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ పథకాల అమలుపై దృష్టి పెట్టీ, డబ్బులు ఇచ్చి మళ్లీ దారిలోకి తీసుకువచ్చామని వెల్లడించారు. జలజీవన్ మిషన్ విషయంలో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులనూ జగన్ హయంలో మళ్లించారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ కేంద్రంతో మాట్లాడి జలజీవన్ మిషన్ పథకం సమయం అయిపోయినా.. మళ్లీ కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చామని తెలిపారు.
రాజకీయాల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలి..
సమాజంలో సంతోషం ఉండాలంటే తమ వారు కూడా రాజ్యాధికారంలో ఉన్నారనే ఆత్మవిశ్వాసం ఆయావర్గాల్లో ఉండాలని సీఎం చంద్రబాబు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి తాము ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు. రూ.500ల నోట్లు రద్దు చేయాలంటే చాలామంది ఎగతాళి చేశారని అన్నారు. రాజకీయాల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే సేవాభావం ఉన్న వారికి అవకాశం కలుగుతుందని చెప్పారు. తాను చేసే ప్రయత్నాలకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. జనం తలచుకున్నప్పుడే ఇలాంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయని పేర్కొన్నారు. తమ హయాంలో పెన్షన్లను రెండు రోజుల ముందుగానే ఇస్తున్నామని ప్రస్తావించారు. పేదవారు ఒక్కరోజు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పారు.
వచ్చే ఏడాది మార్చికి పోలవరం పూర్తి చేస్తాం..
ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత బాధ్యత తీసుకుంటే, వారు కూడా అంత బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఏపీకి కరువు, తుపానులు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరువును జయిస్తున్నామని.. ఎల్‌నినో కారణంగా కొంతమేర ఇబ్బంది పడుతున్నామని వెల్లడించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తున్నామని ఉద్ఘాటించారు. తుపానుల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అర్నబ్, మురుసు తుపానుల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. పోలవరం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి: ఎంపీ శ్రీభరత్
పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News