Share News

అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి: ఎంపీ శ్రీభరత్

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:15 PM

విశాఖపట్నం అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని వెల్లడించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి: ఎంపీ శ్రీభరత్
Visakhapatnam MP Sri Bharat

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ (Visakhapatnam MP Sri Bharat) వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని వెల్లడించారు. ఈరోజు (గురువారం) విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను ఎంపీ పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్, రైల్వే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడారు. కోర్టు కేసులతో అభివృద్ధి పనులు ఒక సంవత్సరం ఆలస్యమయ్యాయని వివరించారు. 2028 డిసెంబరు నాటికి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి అవుతాయని అన్నారు. ఈ స్టేషన్‌లో ప్లాట్ ఫారంలు 8 నుంచి 14కు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.


అంతర్జాతీయ ప్రమాణాలతో..

ఫ్లాట్ ఫామ్‌లు పెరగడంతో రైల్వేస్టేషన్ ఔటర్‌లో రైలు నిరీక్షణ సమస్యకు తెరపడుతుందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ సౌకర్యాలు పెరుగుతాయని అన్నారు. 450 కార్లు, 2000 ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసుకునేలా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. విశాఖ రైల్వేస్టేషన్ దేశంలోనే బెస్ట్ రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందాలని చెప్పారు. ఈ స్టేషన్‌లో రైన్ హార్వెస్టింగ్ , సోలార్ సిస్టం, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఎంపీ శ్రీభరత్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ వేళ.. బాలయ్య ప్రశంసలు.!

ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్.. 145 కి.మీ వేగంతో బలమైన గాలులు..!

పంచాయతీ ఎన్నికలు.. ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిఘా పెట్టిన పోలీసులు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 01:32 PM