Share News

మనందరికీ తలా.. ధోనీ గురించి బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్స్ వైరల్

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:40 AM

ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ధోనీని ఉద్దేశించి మాట్లాడిన ఓ పాత వీడియోను స్టార్ స్పోర్ట్స్ తాజాగా షేర్ చేసింది.

మనందరికీ తలా.. ధోనీ గురించి బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్స్ వైరల్
Nandamuri Balakrishna

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ (MS Dhoni) రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ధోనీని ఉద్దేశించి మాట్లాడిన ఓ పాత వీడియోను స్టార్ స్పోర్ట్స్ తాజాగా షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.


కొన్నేళ్ల క్రితం ధోనీ గురించి బాలకృష్ణ తనదైన శైలిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘కొంతమందికి మహీ.. ఇంకొందరికి కెప్టెన్ కూల్.. మనందరికీ తలా’ అంటూ ధోనీని బాలయ్య ప్రశంసించారు. ఉదయించిన సూర్యుడిలా వెలుగొందిన ఆటగాడని, జట్టును విజయాల బాటలో నడిపించిన నాయకుడని కొనియాడారు. గెలిపించిన వాడు.. ఓడిపోవడం నేర్పించని వాడు అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.


అంతేకాదు, ధోనీకి కేవలం భారతీయులే కాకుండా ప్రత్యర్థి జట్ల అభిమానులు కూడా అభిమానులేనని బాలకృష్ణ పేర్కొన్నారు. మైదానంలో ధోనీ చూపించే ప్రశాంతత, నాయకత్వ లక్షణాలు, ఆటతీరుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనే విషయాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.


ప్రస్తుతం ధోనీ రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో బాలయ్య పాత వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేయడంతో క్రికెట్, సినీ అభిమానులు ఈ వీడియోను ఆస్వాదిస్తున్నారు. కెప్టెన్ కూల్‌పై బాలయ్య చెప్పిన ఈ పవర్‌ఫుల్ మాటలు ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 12:34 PM