Share News

తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:03 AM

అక్వాన్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు (మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో అక్వాన్ తుపానుపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అక్వాన్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు (మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో అక్వాన్ తుపానుపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఏపీని మూడో తుపాను తాకుతోందని వెల్లడించారు. రాష్ట్రానికి ఎన్నో విపత్తులు వచ్చాయని, భయపడాల్సిన అవసరం లేదని... వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని ఆజ్ఞాపించారు.


ప్రజలకు భరోసా కల్పించాలి..

ప్రజలకు, తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపుతూనే ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణవార్డు సిబ్బంది ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నేరుగా సమాచారం అందించాలని మార్గనిర్దేశం చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంతటి పెద్ద విపత్తు సంభవించినా తమను ఆదుకోవడానికి ప్రభుత్వం, అధికారులు ఉన్నారనే భరోసా కల్పించాలని పేర్కొన్నారు. తుపాను వల్ల చెట్లు కూలినా, విద్యుత్ స్థంభాలు నేలకొరిగినా వెంటనే క్లియర్ చేయాలని ఆజ్ఞాపించారు. పునరుద్దరణ పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. రియల్ టైమ్‌లో అంచనాలు వేయాలని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని, పునరావాసం కల్పించాలని ఆదేశించారు. తుపాను కారణంగా చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు చేపట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


తుపాను పరిస్థితులపై అధికారుల వివరణ..

తుఫాన్ గమనంపై అధికారులను వివరాలు అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని అధికారులు తెలిపారు. ఇవాళ సాయంత్రానికి తుపాను తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు వివరించారు. ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే ప్రమాదముందని ఆర్టీజీఎస్ అధికారులు చెప్పారు. చెన్నైకు 610కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమైందని అధికారులు వెల్లడించారు. అక్వాన్ తుపాను కారణంగా 19, 20వ తేదీల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయని అంచనా వేశామని అన్నారు. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 11:47 AM