Share News

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 16 , 2026 | 02:25 PM

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈరోజు (సోమవారం) రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇవాళ సాయంత్రానికి వాయుగుండంగా ఆ తదుపరి తుపానుగా బలపడే సూచనలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.


తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. కేంద్ర బృందం చేసిన సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆజ్ఞాపించారు. ఈ నెల 19, 20వ తేదీల్లో కోస్తాంధ్ర తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అర్నబ్ తరహాలోనే ఈ తుపాను ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు సహా వివిధ జిల్లాల్లో ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేకనే మాపై జగన్ అండ్ కో అసత్య ఆరోపణలు: మంత్రి జనార్దన్ రెడ్డి

వాయుగుండం ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన

అంతర్జాతీయ వేదికపై ఏపీ ఖ్యాతిని జ్యోతి యర్రాజీ చాటారు: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 02:55 PM