Share News

వాయుగుండం ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన

ABN , Publish Date - Nov 15 , 2026 | 09:59 AM

వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. వాయుగుండంగా అల్పపీడనం బలపడిందని వెల్లడించారు.

 వాయుగుండం ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన
Andhra Pradesh Weather Alert

అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. వాయుగుండంగా అల్పపీడనం బలపడిందని వెల్లడించారు. ఆగ్నేయానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. అండమాన్ దీవులకు 700 కిలోమీటర్లు, చెన్నైకు 860 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపారు.


విశాఖపట్నానికి 1040 కిలోమీటర్లు, గోపాల్‌పూర్ (ఒడిశా)కు1160 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. దక్షిణ మధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో రేపు (సోమవారం) తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించారు. ఎల్లుండి (బుధవారం) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి ఇది చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు ప్యాలెస్‌ నుంచి ఏపీపై జగన్ కక్ష సాధిస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి ధ్వజం

గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 10:15 AM