Share News

అంతర్జాతీయ వేదికపై ఏపీ ఖ్యాతిని జ్యోతి యర్రాజీ చాటారు: పల్లా శ్రీనివాసరావు

ABN , Publish Date - Nov 15 , 2026 | 09:18 AM

అర్జున అవార్డుతో ఏపీ ఖ్యాతిని చాటిన క్రీడాకారిణి జ్యోతి యర్రాజీకి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.

అంతర్జాతీయ వేదికపై ఏపీ ఖ్యాతిని జ్యోతి యర్రాజీ  చాటారు: పల్లా శ్రీనివాసరావు
Palla Srinivasa Rao

విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అర్జున అవార్డుతో ఏపీ ఖ్యాతిని చాటిన క్రీడాకారిణి జ్యోతి యర్రాజీకి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) అభినందనలు తెలిపారు. విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు తన ప్రతిభతో జ్యోతి గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.


ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో రెండు స్వర్ణ పతకాలు, ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించడంతో పాటు 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడం గర్వకారణమని పల్లా శ్రీనివాసరావు ప్రశంసించారు. ఆమె పట్టుదల, కృషి, విజయాలు నేటి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కీర్తించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ కీర్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు ప్యాలెస్‌ నుంచి ఏపీపై జగన్ కక్ష సాధిస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి ధ్వజం

గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 09:30 AM