జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
ABN , Publish Date - Nov 16 , 2026 | 07:56 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీవి బకాయిలు... మావి చెల్లింపులు అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు.
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీవి బకాయిలు... మావి చెల్లింపులు అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు.
మీ ఫేక్ పోస్టుకు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది..
‘నేరాలు చేసి నెపం ఇతరులపై నెట్టడం, బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి బానిసైన జగన్ రెడ్డి గారు... మీ ఫేక్ పోస్టుకు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా క్రమపద్ధతిలో బకాయిలు తీరుస్తున్న చిత్తశుద్ధి మాది. బకాయిలు పెట్టి బురదజల్లే దుర్బుద్ధి మీది. ఐదేళ్ల మీ పాలనలో మీ బొమ్మల పిచ్చితో వేలకోట్లు పబ్లిసిటీకి మళ్లించారు. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సుమారుగా రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నరేళ్లలోనే దాదాపు రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. ఇవీ నిధుల విడుదల లెక్క.. మీకు అర్థం అవుతుందా?’ అని మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేకనే మాపై జగన్ అండ్ కో అసత్య ఆరోపణలు: మంత్రి జనార్దన్ రెడ్డి
వాయుగుండం ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన
అంతర్జాతీయ వేదికపై ఏపీ ఖ్యాతిని జ్యోతి యర్రాజీ చాటారు: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News