Share News

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. సాక్షి అసత్య ప్రచారం చేస్తోంది.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

ABN , Publish Date - Nov 16 , 2026 | 07:07 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సాక్షి పత్రికపై ఏపీ వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రొయ్యల రైతుల పేరుతో జగన్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని, సాక్షి పత్రిక తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. సాక్షి అసత్య ప్రచారం చేస్తోంది.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
AP Minister Kinjarapu Atchannaidu

అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), సాక్షి పత్రికపై ఏపీ వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Kinjarapu Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రొయ్యల రైతుల పేరుతో జగన్ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని, సాక్షి పత్రిక తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. రైతుల కష్టాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ, వాస్తవాలను వక్రీకరించి భయాందోళనలు సృష్టించడం తగదని హితవు పలికారు. ఈరోజు (సోమవారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అర్నాబ్, మురసు తుపానుల వల్ల రాష్ట్రంలో 1,071 మంది ఆక్వా రైతులకు చెందిన 1,720.90 హెక్టార్లలో నష్టం జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు.


కేంద్రానికి పరిహార ప్రతిపాదనలు పంపాం..

ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం రూ.3.96 కోట్ల నష్టం అంచనా వేసి కేంద్రానికి పరిహార ప్రతిపాదనలు పంపామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తుపానులకు ముందే రైతులను అప్రమత్తం చేసి, నష్టనివారణ చర్యలు చేపట్టామని వెల్లడించారు. జగన్ హయాంలో 100 కౌంట్ రొయ్యల ధర కిలో రూ.200 నుంచి రూ.210 పరిధిలో ఉండేదని, ఈ ఏడాది సెప్టెంబరులో రూ.280లకు చేరిందని గుర్తుచేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్, సరఫరా ఒడిదుడుకులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం సరికాదని చెప్పారు. రైతులకు మెరుగైన ధరలు అందించేందుకు ఫార్మ్‌గేట్ ప్రైస్ మానిటరింగ్ కమిటీ ద్వారా తాము పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.


రైతులకు రాయితీ..

రొయ్యల మేత ధరలపై ప్రతి 45 రోజులకు ఒకసారి రైతు సంఘాలు, కంపెనీలతో తాము సమీక్షిస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు రూ.1,300 కోట్ల మేర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని తెలిపారు. అర్హులైన ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50లకే అందిస్తున్న విషయాన్ని జగన్ పత్రిక ఉద్దేశపూర్వకంగా ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించారు. రైతుల సాగు వ్యయం తగ్గించడం, గిట్టుబాటు ధరలు అందించడం, ఎగుమతి అవకాశాలు మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేకనే మాపై జగన్ అండ్ కో అసత్య ఆరోపణలు: మంత్రి జనార్దన్ రెడ్డి

వాయుగుండం ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన

అంతర్జాతీయ వేదికపై ఏపీ ఖ్యాతిని జ్యోతి యర్రాజీ చాటారు: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 07:31 PM