కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ
ABN , Publish Date - Nov 17 , 2026 | 10:21 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీకి కూడా వెళ్లారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు.
అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (మంగళవారం) ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. ఈ హబ్‌పై ఇప్పటికే సిద్ధమైన ప్రతిపాదనలను పట్టాలెక్కించే అంశంపై మాట్లాడనున్నారు.
ఏపీలో వరుస తుపానులు, ఎల్‌నినో పరిస్థితుల వల్ల జరిగిన నష్టం నేపథ్యంలో ఆర్థిక సాయం అందించాలని సీఎం కోరనున్నారు. అర్నబ్, మరసు తుపానుల వల్ల జరిగిన నష్టంపై ఇప్పటికే కేంద్రానికి వివరాలు పంపించారు. అదేవిధంగా ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తలెత్తిన సమస్యల గురించి కూడా కేంద్ర మంత్రికి వివరించనున్నారు. సాయంత్రం ఢిల్లీలో ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఇంట్లో శుభకార్యానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అనంతరం ఈరోజు రాత్రికి సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News